శేఖ‌ర్ క‌మ్ముల‌ పరిస్థితి కాస్త విచిత్రం

ఒక్కోసారి ఎంత మంచి సినిమా తీసినా జ‌నాలు చూడ‌రు… ఒక్కోసారి స‌రైన కంటెంట్ లేని సినిమాలు తీసినా జ‌నాలు హిట్ చేస్తారు. జ‌నాల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ? ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అది అదృష్టం మీద బేస్ అయ్యి ఉంటుంది. తాజాగా శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్‌తేజ్ – సాయిప‌ల్ల‌వి కాంబోలో తెర‌కెక్కిన ఫిదా మూవీ ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఎన్ని సినిమాలు వ‌స్తున్నా ఫిదా రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో పాటు ఇంకా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న ప‌రుగు ఆప‌లేదు. ఈ రేంజ్‌లో సినిమా హిట్ అయితే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌కు ఏ రేంజ్‌లో డ‌బ్బులు రావాలి. అయితే ఆయ‌న‌కు చాలా చాలా త‌క్కువ రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే వ‌చ్చింద‌ట‌. శేఖ‌ర్‌కు ఈ సినిమాకు మాత్ర‌మే కాదు..గ‌తంలో తాను తీసిన సినిమాల విష‌యంలోను అంతే జ‌రిగింద‌ట‌.

హ్యాపీడేస్ సినిమాను శేఖ‌ర్ సొంతంగా తీశాడు. ఆ సినిమాకు లాంగ్ ర‌న్‌లో రూ.10 కోట్ల వ‌ర‌కు లాభం వ‌చ్చింది. అయితే సినిమా తీశాక మ‌నోడు భ‌యంతో సినిమాను చాలా త‌క్కువ రేటుకు దిల్ రాజుకు అమ్మేశాడ‌ట‌. మ‌హా అయితే కోటి కూడా గిట్ట‌లేద‌ని స‌మాచారం. త‌ర్వాత మ‌నోడికి స‌రైన ఛాన్సులు రాలేదు. తానే స్వ‌యంగా స్టోరీ చెప్పినా మ‌హేష్‌, చెర్రీ రిజెక్ట్ చేశారు.

ఇక విసిగిపోయి ఫిదా స్టోరీని దిల్ రాజు ద్వారా వ‌రుణ్‌కు చెప్పాడు. ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ రాబ‌ట్టినా శేఖ‌ర్ లాభాల్లో వాటాకు చేయ‌క‌పోవ‌డంతో నిర్మాత‌కు, బయ్య‌ర్ల‌కు ఈ సినిమా భారీ లాభాలు మిగిల్చినా శేఖ‌ర్‌కు మాత్రం రెమ్యునరేష‌న్ మాత్ర‌మే మిగిలింద‌ట‌.