బెల్లంకొండ “సీత ” ప్రీమియర్ షో టాక్

May 24, 2019 at 11:44 am

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజ‌ల్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం సీత‌. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రీమియ‌ర్ టాక్ షో ఎలా ఉందో చూద్దాం.. 161 నిమిషాల నిడివి కల “సీత” మూవీ రామ్ (బెల్లం కొండ శ్రీనివాస్) బాల్యానికి సంబందించిన సన్నివేశాలతో కథ నడుస్తుంది. త‌ర్వాత కథ ప్రస్తుతం లోకి ప్రవేశిస్తుంది. కాజల్ క్యారెక్టర్ స్వ‌భావాన్ని తెలిపేవిధంగా ఉన్న ఎంట్రీ సాంగ్ ఉంటుంది. ఆ త‌ర్వాత కొన్ని హాస్య‌పు స‌న్నివేశాల‌తో సినిమా ముందుకు వెళ్తుంది. ఇక విలన్ సోనూసూద్ ఎంట్రీ అవుతాడు. అత‌ను ఓ ఎం ఎల్ ఏ గా పరిచయమవుతాడు. అతనికి రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి కాజల్ కి సోను సూద్ కి మధ్య కథలో కీలకమైన కొన్ని సన్నివేశాలతో క‌థ ముందుకు సాగుతుంది.

ఊహించని పరిణామాలతో ఏర్పడిన కొన్ని విషాద సన్నివేశాల తరువాత కథ భూటాన్ కి షిఫ్ట్ అవుతుంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిజమేనా అనే సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. వాస్తవ ప్రపంచంలో ఉండే కల్మషాలు, కుట్రలు గురించి ఏమి తెలియని ఓ సౌమ్యుడిగా బెల్లంకొండ పాత్రను ద‌ర్శ‌కుడు చూపిస్తాడు. మ‌ధ్య‌లో బుల్లితెర కమెడియన్ బిత్తిరి సత్తి హాస్యసన్నివేశాలు న‌వ్విస్తాయి. ఉద్దేశపూర్వకంగా రామ్ తోడు తనకు అవసరం అని భావించిన కాజల్ , భూటాన్ నుంచి హైదరాబాద్ కి శ్రీనివాస్ ని కారులో తీసుకెళ్తుంది. ప్రకృతి అందాల మ‌ధ్య కార్ జర్నీ చేస్తున్న కాజల్, శ్రీనివాస్ ల మధ్య కోయిలమ్మ సాంగ్ నడుస్తుంది.

కాజల్,రామ్ హైదరాబాద్ చేరుకోవడంతో కథ మరలా హైదరాబాద్ కి చేరింది. ఇక్క‌డ‌ సందర్భానుసారంగా కొన్ని హాస్యసన్నివేశాలు ఉంటాయి. సోను సూద్ పీడ వదిలించుకోవడానికి కాజల్ కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. తనకు కావలసిన ఆ డబ్బును రామ్ ను ఉపయోగించుకొని సమకూర్చుకోవాలని అనుకుంటుంది. అయితే డబ్బు కోసం కాజల్ వేసుకొన్న ప్లాన్ ని హీరో రామ్ అనుకోకుండా భగ్నం చేస్తాడు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో కాజల్ చేసేదేమిలేక రఘురాంని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. కథలో ఊహించని మలుఫు తో సగభాగం పూర్త‌వుతుంది.

విరామం అనంత‌రం కొన్ని కీలక సన్నివేశాలు తెర‌పై క‌నిపిస్తాయి. కాజల్ ని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. కాజల్ ని బయటకు తేవాలని రామ్ విశ్వప్రయత్నం చేస్తుంటాడు. పరిస్థితుల రీత్యా పోలీస్ స్టేషన్ లో పోరాటం జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. హీరో , హీరోయిన్ మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు నడుస్తున్నాయి.పోలీసుల నుంచి త‌ప్పించుకునే క్రమం లో కాజల్, రామ్ నగరంలోని ఓ మురికివాడలో ఉన్న ఇంట్లో వెళ్ళి తలదాచుకుంటారు. బెల్లంకొండ ,పాయల్ రాజపుత్‌ల‌ మధ్య వచ్చే ఐటెం సాంగ్ బుల్రెడ్డి సాంగ్ వస్తుంది. కాజల్ , రామ్ కోసం పోలీసుల వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది.

ఈ క్రమంలో బిత్తిరి సత్తి పోలీస్ ల మధ్య కొన్ని హాస్యసన్నివేశాలు వ‌స్తాయి. విలన్ సోనూ సూద్ హెచ్చరిస్తున్నా ఖాతరు చేయకుండా,రామ్ కాజల్ ని బెయిల్ పై విడిపిస్తాడు. సోనూసూద్ పెదనాన్నగా కోట శ్రీనివాస్ రావు క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత క‌థ‌లో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంటుంది. హీరోపై విలన్ గ్యాంగ్ దాడి చేస్తుంది. సినిమా చివరిదశకు చేరుకోవడం హీరో హీరోయిన్ కి అలాగే విలన్ కి మధ్య సీరియస్ కథనం చోటుచేసుకుంటుంది. కొన్ని విషాదకర సన్నివేశాలతో హృద్యంగా తెరకెక్కించిన నిజమేనా సాంగ్ వస్తుంది. అనేక మలుపులు, ఉత్కంఠ మధ్య “సీత” మూవీని తేజ తన స్టైల్ లో ముగిస్తాడు.

బెల్లంకొండ “సీత ” ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share