2019 రామాయ‌ణం… ‘ సీత ‘ ట్రైల‌ర్ ఎలా ఉందంటే… (వీడియో)

May 10, 2019 at 10:54 am

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెర‌కెక్కిన సీత ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌వ‌చం సినిమాతో ప్లాప్ కొట్టిన సాయి శ్రీనివాస్ – కాజ‌ల్ జోడీ మ‌రోసారి వెంట‌నే జోడీ క‌ట్టిన ఈ సినిమాను తేజ రూపొందిస్తుండ‌డంతో అంచ‌నాలు బాగానే ఉన్నాయ్‌. వ‌రుస ప్లాపుల్లో ఉన్న తేజ ఒక్క‌సారిగా నేనే రాజు – నేనే మంత్రి సినిమాతో ట్రాక్‌లోకి ఎక్కాడు.

ఇక తాజాగా సీత ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే మ‌రోసారి తేజ మార్క్ ల‌వ్ స్టోరీగానే ఉండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ప‌ల్లెటూరు, విల‌న్ హీరోయిన్‌ను హెరాస్ చేసి పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం… చివ‌రకు హీరో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌ను కాపాడ‌డం.. ఇదే ఫార్ములాలో సీత సినిమా ఉంటుంద‌ని ట్రైల‌ర్‌తోనే తేజ చెప్పేశాడు. సీత కోసం కాచుకుని ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సోను సూద్ నుంచి తప్పించుకోవడం కోసం రాముని దొంగ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది.

ఇక సినిమాలో కాజ‌ల్ సీత‌, శ్రీనివాస్ రాముడు… సోనూ సుద్ రావ‌ణుడు అన్న‌ది తేలిపోయింది. సోనూ సూద్ మాత్రం తానే రాముడిని అని త‌న‌కే సీత అని త‌న మార్క్ విల‌నిజం చూపిస్తాడు. స్టోరీ రెగ్యుల‌ర్ అయినా సినిమా ప్ర‌జెంట్ చేసిన తీరు కొత్త‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా ఇది రామాయ‌ణం టైప్‌లో డిఫ‌రెంట్ స్టోరీగా ఉంది. మ‌రి సీత‌పై చాలా మందే ఆశ‌లు పెట్టుకున్నారు. వీరి రాత‌ల‌ను సీత ఎలా మారుస్తుందో ? 24న తేలిపోనుంది.

2019 రామాయ‌ణం… ‘ సీత ‘ ట్రైల‌ర్ ఎలా ఉందంటే… (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share