రాజ‌మౌళి కి ఝ‌ల‌క్ ఇచ్చిన త‌ల్లికూతుళ్ళు…?

June 22, 2019 at 1:57 pm

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళికే ఝ‌ల‌క్ ఇవ్వ‌డ‌మా… అది ఒక కుర్ర‌ది… ఇప్పుడిప్పుడే చిత్ర‌సీమ‌లో అడుగులు వేస్తున్న ఈ బుడ‌త‌ది ఏకంగా రాజ‌మౌళికే ఝ‌ల‌క్ ఇవ్వ‌డ‌మేంట‌నే చ‌ర్చ హాట్‌టాపిక్‌గా మారింది. రాజ‌మౌళి నుంచి పిలువు వ‌స్తే వెళ్ళి న‌టించ‌డానికి ఎంద‌రో మ‌హామ‌హులైన న‌టులు ఎదురు చూస్తున్న ఈ త‌రుణంలో ఓ కుర్ర హీరోయిన్ రాజ‌మౌళి ఇచ్చిన ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కు రాజ‌మౌళి ఇచ్చిన ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన సుంద‌రి ఎవ‌రో కాదు అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాహ్న‌వి.

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, న‌టుడు సూర్య‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ నుంచి మొద‌లు కొంటే టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ తేడా లేకుండా న‌టీన‌టులు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌నే కోరిక‌తో ఉన్నారు. ఎప్పుడు రాజ‌మౌళి నుంచి పిలుపు వ‌స్తుందా అని ఎదురుచూసే న‌టులే ఉన్న స‌మ‌యంలో రాజ‌మౌళి ఇచ్చిన ఆఫ‌ర్‌ను అందాలన‌టి, అతిలోక సుంద‌రి దివంగ‌త శ్రీ‌దేవి కూతురు జాహ్న‌వి తిర‌స్క‌రించ‌ద‌నే వార్త నెట్టింట్లో హాల్‌చ‌ల్ చేస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అదే సినిమాలో మ‌రో హీరోయిన్‌గా హాలీవుడ్ బామ‌ను ఎంపిక చేశారు. కానీ ఆమే ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. దీంతో ఈ పాత్ర‌కు జాహ్న‌వికి ఆఫ‌ర్ చేశార‌ట రాజ‌మౌళి. దీంతో నేను ఈ సినిమాలో న‌టించ‌లేన‌ని, ఎందుకంటే అలియా భ‌ట్ క‌న్నా నా పాత్ర త‌క్కువ‌గా ఉన్నందున నా కేరీర్‌కు అది మంచిది కాద‌ని అందుకే నేను న‌టించ‌లేనంటూ ఆమే రాజ‌మౌళి ఆఫ‌ర్ తిర‌స్క‌రించింద‌ట‌. దీంతో రాజ‌మౌళి షాక్ తిన్నాడ‌ట‌. బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌కు శ్రీ‌దేవిని నటించ‌మ‌ని శ్రీ‌దేవిని రాజ‌మౌళి అడిగితే ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిద‌ట‌. ఈ విష‌యాన్ని రాజ‌మౌళే స్వ‌యంగా చెప్పారు. అప్పుడు త‌ల్లి ఇప్పుడు కూతురు రాజమౌళి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించ‌డం కొస‌మెరుపు.

రాజ‌మౌళి కి ఝ‌ల‌క్ ఇచ్చిన త‌ల్లికూతుళ్ళు…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share