చిరంజీవి “సైరా”కు మ‌రో ఆటంకం…|

May 16, 2019 at 4:22 pm

మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సైరా సినిమాకు అడుగ‌డుగునా ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా గండాల సుడి గుండంలో కొట్టు మిట్టాడుతుంది. సైరా షూటింగ్ మొద‌ల‌యిన‌ప్ప‌టికి అనుకున్న మేర‌కు ముందుకు సాగ‌డం లేద‌ని సిని వ‌ర్గాలు అంటున్నాయి. సైరా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఓ విదేశీ న‌టుడు అనుకోకుండా మృతి చెందాడు.

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బ్రిటీష్ పాల‌కులు, వారి అనుచ‌రుల పాత్ర‌ల కోసం విదేశీ న‌టుల‌ను ఎంపిక చేశారు. అందులో భాగంగా ర‌ష్యా నుంచి కొంద‌రు న‌టుల‌ను ఇక్క‌డికి తీసుకొచ్చి ఇక్క‌డే యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రిస్తున్నారు.

ర‌ష్యా నుంచి వ‌చ్చి ఇక్క‌డ సైరా షూటింగ్‌లో పాల్గొంటున్న అలెగ్జాండ‌ర్ అనే న‌టుడు వ‌డ‌దెబ్బ‌తో మృతి చెందాడ‌ని యూనిట్ వ‌ర్గాలు తెలిపాయి. సైరా షూటింగ్ ప్ర‌స్తుతం క‌డ‌ప ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న అలెగ్జాండ‌ర్ ఎండ వేడికి తాళ‌లేక వ‌డ‌దెబ్బ‌కు గురై మృతి చెందాడ‌ట‌. గచ్చిబౌలిలో ఓ అపార్టుమెంట్‌లో గ‌త ఏడాదిగా టూరిస్టు వీసా మీద ఉంటున్నాడు. వ‌డ‌దెబ్బ‌తో అప‌స్మార‌క స్థితిలో ఉన్న అలెగ్జాండ‌ర్‌ను తోటి న‌టుడు బోరెజ్ స్థానికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ అస్పత్రికి తీసుకెళ్ళారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆయ‌న మృతి చెందాడు.

సైరా సినిమా షూటింగ్‌లో అనేక ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. అందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల షూటింగ్ సెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో సుమారు కోటికి పైగా ఆస్తి న‌ష్టం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్‌కు అంత‌రాయం క‌లిగింది. ఇప్పుడు విదేశీ న‌టుడు మృతి చెంద‌డంతో సైరాకు అడుగ‌డుగునా ప్ర‌మాదాలే ప‌ల‌క‌రిస్తున్నాయ‌ని చిత్ర‌యూనిట్ ఆందోళ‌న చెందుతుంది. అయితే అలెగ్జాండ‌ర్ పాత్ర షూటింగ్ ముగిసిందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒక‌వేళ ఆ పాత్ర షూటింగ్ పూర్తి కాకుంటే సైరా సినిమా విడుద‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకోనున్నాయి. ఈ సినిమాను అక్టోబ‌ర్‌2న విడుద‌ల చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు చిత్ర‌యూనిట్‌.

చిరంజీవి “సైరా”కు మ‌రో ఆటంకం…|
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share