చిరుకి షాక్ : సేల్ అవ్వని “సైరా “

June 21, 2019 at 12:28 pm

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా బిజినెస్ చాలా డ‌ల్ డ‌ల్‌గా న‌డుస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో టాక్ న‌డుస్తోంది. తెలుగు వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ ఎలా ఉన్నా శాటిలైట్ , డిజిట‌ల్ రైట్స్ రేటు డీల్ ఓ ప‌ట్టాన తేల‌డం లేద‌ట‌. నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ రేట్ల‌ను కొండెక్కించేయ‌డంతో అటు వైపు వాళ్లు తాము అంత పెట్ట‌లేం అని ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నార‌ట‌.

సైరాలో కావాల్సినంత స్టార్ కాస్టింగ్ ఉంది. అమితాబ్ ఉన్నారు. విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలా అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా నటీనటుల్ని సెట్ చేసుకున్నా సినిమాకు మిగిలిన భాష‌ల్లో అంత క్రేజ్ రావ‌డం లేదంటున్నారు. క‌థ కూడా తెలుగు స‌ర్కిల్‌కు ప‌రిమిత‌మైంది కావ‌డంతో మిగిలిన భాష‌ల ప్రేక్ష‌కుల్లో అంత ఆస‌క్తి లేద‌న్న టాక్ కూడా వ‌స్తోంది.

ఇక సైరా శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్‌ను రూ.110 కోట్ల‌కు అమ్మాల‌ని చూస్తున్నా ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ర‌జ‌నీ కాంత్ 2.0 డీల్ ఇదే అమౌంట్‌కు క్లోజ్ అయ్యింది. ఇది సౌత్ ఇండియాలోనే పెద్ద డీల్‌. సైరాను ఇంత‌కంటే ఎక్కువ రేటుకు అమ్మి సౌత్ రికార్డు క్రియేట్ చేయాల‌నుకుంటున్నారు. క‌నీసం ఈ రేటును స‌మం చేయాల‌నుకుంటున్నా ఇది కూడా సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేదు.

చిరుకి షాక్ : సేల్ అవ్వని “సైరా “
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share