సై సై సైరా… సై…!

June 24, 2019 at 2:26 pm

టాలీవుడ్‌ ఇప్పుడు సాహో, సైరా సినిమాల మానియాలో మునిగిపోయింది. సైరా, సాహో సినిమాలు విడుద‌ల తేదీల‌ను చిత్ర యూనిట్లు ముందుగానే ప్ర‌క‌టించారు. సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది టాలీవుడ్‌లో ఎక్క‌డ లేని టెన్ష‌న్ నెల‌కొంది. ఈ రెండు సినిమాకు సంబంధించిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు విడుద‌ల‌కు స‌న్న‌హాలు చేస్తున్నారు. సాహో సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయిన‌ప్ప‌టికి ప్ర‌మోష‌న్‌లో భాగంగా మ‌రికొన్ని ట్రైల‌ర్లు విడుద‌ల చేయాల‌ని చూస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఆలోచ‌న‌ట‌.

ఇక సైరా సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను, టీజ‌ర్‌ను గ‌తంలో విడుద‌ల చేసిన‌ప్ప‌ట‌కి పూర్తి స్థాయిలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు కాలేదు. త్వ‌ర‌లో సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసేందుకు చిత్ర నిర్మాత మెగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్న‌హాలు చేస్తున్నాడ‌ట‌. అందులో భాగంగా ట్రైల‌ర్ రూప‌క‌ల్ప‌న‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ చిత్ర యూనిట్‌ను ఆదేశించాడ‌ట‌. ఈ ట్రైల‌ర్‌ను భారీ ఎత్తున రూపొందించాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.

అయితే సైరా ట్రైల‌ర్‌ను చూస్తే బాలీవుడ్‌, టాలీవుడ్ ప్రేక్ష‌కులు మ‌రో బాహుబ‌లి లా ఉండాల‌నే నియ‌మం పెట్టాడ‌ట‌. ట్రైల‌ర్ చూసిన‌వారు బాహుబ‌లి సినిమా రేంజ్‌లో క‌నిపిస్తే ఆ సినిమాకు దేశ‌వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయి చిత్రం భారీ విజ‌యంతో పాటు, భారీ వ‌సూళ్ళ‌ను రాబ‌డుతుంద‌నేది రామ్ చ‌ర‌ణ్ న‌మ్మ‌క‌మ‌ట‌. అందుకు సైరా సినిమా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డికి మంచి ట్రైల‌ర్‌ను త‌యారు చేయాల‌ని సూచించాడ‌ట రామ్‌చ‌ర‌ణ్‌. మంచి సీన్ల‌ను, ప్ర‌జ‌ల్లోకి వెళ్ళే సీన్ల‌తో ప్ర‌త్యేకంగా ట్రైల‌ర్‌ను రూపొందించాల‌ని, తిరుగులేని విజ‌యం సాధించేలా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. సో సైరా ట్రైల‌ర్‌తోనే సై సై అనాల‌ని, చిరంజీవి పుట్టిన రోజైన ఆగ‌స్టు22న విడుద‌ల‌కు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

సై సై సైరా… సై…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share