మెగాస్టార్ ” సైరా” విడుద‌ల తేదీ ఖరారు …?

May 10, 2019 at 4:04 pm

బ్రిటిష్ పాల‌కులపై తిరుగుబాటు చేసి భార‌త స్వాతంత్రోధ్యమం కోసం పోరాటం చేసిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న సైరా న‌రసింహారెడ్డి సినిమా గాంధీ జ‌యంతి రోజైన అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌నున్నారా…? అవున‌నే అంటున్నాయి సైరా సినిమా యూనిట్ వ‌ర్గాలు. తెలుగు చిత్ర‌సీమ‌లో ఓ మైలురాయిగా నిలిచిపోనున్న ఈ సైరా సినిమాను ముందుగానే విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త వైర‌ల్ అవుతోంది.

మేగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్‌చర‌ణ్ త‌న సొంత బ్యాన‌ర్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ సార‌ధ్యంలో సైరా సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మేగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో సైరా న‌ర‌సింహారెడ్డిగా న‌టిస్తున్నారు. ఇందులో చిరంజీవికి గురువుగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార నాయ‌కిగా చిరంజీవి స‌ర‌స‌న జోడి క‌ట్టింది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు చిత్ర‌యూనిట్‌.

సైరా సినిమా షూటింగ్ సంద‌ర్భంగా భారీ సెట్టింగ్‌లో మంట‌ల్లో కాలిపోవ‌డంతో సినిమా విడుద‌ల ఆల‌స్యం అవుతుంద‌ని అంతా అనుకున్నారు. సెట్టింగ్ ల ద‌గ్ధంతో సినిమా సంక్రాంతి కాని, ద‌స‌రాకు కాని రిలిజ్ చేస్తారనే ఊహ‌గానాలు వినిపించాయి. కాని ద‌స‌రా పండుగ‌కు కాకుండా అంత‌క‌న్నా ముందే అంటే గాంధీ జ‌యంతి రోజైన అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌కు స‌న్న‌హాలు చేస్తున్నార‌ట‌. అక్టోబ‌ర్‌లో చేస్తే ద‌స‌రా క‌న్నాముందు మ‌రే సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డంతో అన్ని దియోట‌ర్ల‌లో సైరా సినిమా హ‌ల్ ఛ‌ల్ చేస్తుంద‌ని నిర్మాణ సంస్థ ఆలోచ‌న‌గా ఉంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రాఫిక్ వ‌ర్క్‌, పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తున్న‌ట్లు స‌మాచారం.

మెగాస్టార్ ” సైరా” విడుద‌ల తేదీ ఖరారు …?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share