“లిప్‌లాక్ “కు సిద్దమే :టాలీవుడ్ సీనియర్ హీరోయిన్

June 11, 2019 at 2:13 pm

చూడ‌గానే ఆక‌ట్టుకునే అందం ఆమే సొంతం. టాలీవుడ్ లో త‌న గ్లామ‌ర్ న‌ట‌న‌తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టిన సుంద‌రి. బాలీవుడ్‌లో పెర్పామెన్స్ ఓరియెంటెడ్ న‌ట‌న‌తో ఫిదా చేసిన భామ తాప్సీ. ఆమే న‌ట‌న‌తో మెప్పించినప్ప‌టికి ఏదో వెలితిగా బాధ‌ప‌డుతోంది. ఏంటా బాధ అని అడిగితే అదేం లేదండి నాకు టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అనేక అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ నాకు కావాల్సిన పాత్ర‌లు ఇవ్వ‌డం లేద‌ని తెగ ఇదై పోతోంది అమ్మ‌డు..

ఇంత‌కు ఏ పాత్ర‌లు అని అడిగితే ట‌క్కుల స‌మాధానం చెప్పింది తాప్సీ. నాకు పెర్పామెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌నే ఇస్తున్నారు.. న‌న్ను ఈ పాత్ర‌ల‌కే ప‌రిమితం చేస్తున్నారు.. గ్లామ‌ర్ పాత్ర‌లు ఇవ్వ‌డం లేదు అని తెగ బాధ ప‌డిపోతోంది. నేను గ్లామ‌ర్ పాత్ర‌లే చేయ‌డానికి రెడి అంటూనే అవ‌స‌ర‌మైతే లిప్‌లాక్ కు సిద్ద‌మేనంది ఈ సుంద‌రి. తాప్సీ లిప్‌లాక్‌కు సిద్ధ‌మైనా కూడా ద‌ర్శ‌కులు ఆ పాత్ర‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ట‌. ఎందుకో తెలియ‌దు మ‌రి.

ప్ర‌స్తుతం తాప్పీ గేమ్ ఓవ‌ర్ సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో సుమారు 60శాతం మేర‌కు వీల్‌చైర్‌కు ప‌రిమితం అయ్యె పాత్ర‌లోనే న‌టించిందట‌. ఈ న‌ట‌న కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంద‌ట తాప్సీ. అయితే పెర్పామెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లో న‌టించి బోరు కొట్టింద‌ట తాప్పీకి. గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి తానేంటో నిరూపించుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంది ఈ సుంద‌రి. ద‌ర్శ‌కులు తాప్సీ మొర ఆల‌కించైనా లిప్‌లాక్ స‌న్నివేశాలు ఉన్న పాత్ర‌లు ఇవ్వాల‌ని వేడుకుంటున్నారు సిని ప్రియులు.

“లిప్‌లాక్ “కు సిద్దమే :టాలీవుడ్ సీనియర్ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share