డ్ర‌గ్ కేసులో టాలీవుడ్ హీరోల‌కు క్లీన్ చీట్‌.

May 14, 2019 at 3:04 pm

తెలుగు సిని ప‌రిశ్ర‌మను ఉక్కిరి బిక్కిరి చేసిన డ్ర‌గ్ కేసు నీరుగారిపోయింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ డ్ర‌గ్ కేసు నుంచి తెలుగు సిని ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు క్లీన్ ఇమేజ్‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌కు డ్ర‌గ్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు డ్ర‌గ్ అమ్ముతున్న వ్య‌క్తులు పోలీసుల విచార‌ణలో బ‌య‌ట పెట్టారు. ఈ డ్ర‌గ్ కేసులో పెద్ద హీరోల పుత్ర‌ర‌త్నాలు, ప్ర‌ముఖ హీరోలు, పెద్ద ద‌ర్శ‌కులు, సిని రంగానికి చెందిన అనేక మంది ఇరుక్కున్నారు

ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై కేసులు న‌మోదు చేసి విచార‌ణ జ‌రిపారు. విచార‌ణ జ‌రుగుతున్న రోజుల్లో ఈకేసుపై తీవ్ర‌మైన ఉత్కంఠ నెల‌కొనేది. విచార‌ణ సంద‌ర్భంగా తెలుగు ప్ర‌జ‌ల దృష్టంతా విచార‌ణ‌పై ఉండేది. డ్ర‌గ్ కేసుల్లో తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖులు చిక్కుకోవ‌డంతో టాలీవుడ్ విల‌విలాడిపోయింది. ఈ కేసుతో తెలుగు చిత్ర‌సీమ ప‌రువు కూడా గంగ‌లో క‌లిసింది. దేశ‌మంతా సంచ‌ల‌నం సృష్టించిన ఈకేసు లో ఎలాంటి పురోగ‌తి లేకుండానే టాలీవుడ్ క్లీన్ అంటూ సిట్ స‌ర్టిఫికేట్ ఇచ్చింది.

డ్ర‌గ్ కేసుపై ఓ సామాజిక కార్య‌క‌ర్త స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద క‌మీష‌న్‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకోగా ఈ షాకింగ్ న్యూస్ తెలిసింది. డ్ర‌గ్ కేసులో ఇరుక్కున్న వారిని సిట్ బృందం అనేక ద‌ఫాలుగా విచారించింది. విచార‌ణ సంద‌ర్భంగా ర‌క్త‌
న‌మూనాల‌ను, గోళ్ళ , వెంట్రుక‌ల న‌మూనాల‌ను సేక‌రించి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాని వీరంతా ఎలాంటి డ్ర‌గ్ తీసుకోలేద‌ని వీళ్ళ పేర్ల‌ను కేసుల నుంచి తొల‌గించిన‌ట్లు స‌మాచారం ఇచ్చారు. మొత్తం 12కేసుల‌ను న‌మోదు చేయ‌గా, 62 మందిని విచారించారు.

ర‌వితేజ‌, పూరి జ‌గ‌న్నాథ్ లు మిస్ట‌ర్ క్లీన్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ కేసు నుంచి విముక్తి పొందిన వారిలో హీరోలు ర‌వితేజ‌, త‌రుణ్‌, న‌వ‌దీఫ్‌, త‌నీష్‌, నందు న‌టులు సుబ్బ‌రాజు, న‌వ‌పాద ధ‌ర్మ‌రావు(చిన్న‌), ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్, హీరోయిన్లు చార్మీకౌర్‌, మొమైత్‌ఖాన్‌, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ర‌వితేజ కారుడ్రైవ‌ర్ శ్రీ‌నివాస్‌తో పాలు ప‌లువురు ఉన్నారు. తెలంగాణ స‌ర్కారుపై టాలీవుడ్ పెద్దల ఒత్తిడి మేర‌కే ఈ కేసును నీరుగార్చార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

డ్ర‌గ్ కేసులో టాలీవుడ్ హీరోల‌కు క్లీన్ చీట్‌.
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share