నిర్మాత‌గా మారిన టాలీవుడ్ క్రెజీ డైరెక్టర్ …!

June 12, 2019 at 11:05 am

ద‌ర్శ‌కులుగా ఎన్నో హిట్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌వారు ఇప్పుడు నిర్మాత‌లుగా మారుతున్నారు. టాలీవుడ్‌లో అగ్ర‌ద‌ర్శ‌కులుగా మారిన వారు నిర్మాత‌లుగా సొంత బ్యాన‌ర్లు ఏర్పాటు చేసుకుంటూ విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. ఒక‌రెంట ఒక‌రు ఇలా అగ్ర‌ద‌ర్శ‌కులంతా నిర్మాత‌లుగా మార‌డానికి కార‌ణ‌మేమై ఉంటుందా అనే చ‌ర్చ సిని వ‌ర్గాల్లో టాక్‌. ఇటు ద‌ర్శ‌కులు, అటు న‌టులు కూడా నిర్మాతలుగా మారి కోట్లాది రూపాయ‌ల‌ను సొమ్ము చేసుకుంటున్నారు.

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి నుంచి మొద‌లుకొని సుకుమార్‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో పాటు అనేక‌మంది సొంతంగా బ్యాన‌ర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు బ్లాక్‌బ్ల‌స్ట‌ర్‌గా నిలుస్తుండ‌టంతో భారీ లాభాల‌ను సొంతం చేసుకుంటున్నాయి వీరి సినిమాలు. ఈ వ‌చ్చే లాభాల‌ను నిర్మాత‌లు పొందుతుండ‌టంతో క‌ష్టం మాది, ఫ‌లితం నిర్మాత‌లదా అనే కోణంలో ఆలోచించిన వీరు క‌ష్టం మాదే ఫ‌లితం మాదే అనే సూత్రంతో మా సినిమాల‌ను మేమే నిర్మించుకుంటాం, మా లాభాలు మేమే తీసుకుంటామ‌నే ఆలోచ‌న‌తో నిర్మాత‌లుగా మారుతున్నారు…

ద‌ర్శ‌కుల నుంచి నిర్మాత‌లుగా ఓ వైపు అగ్ర‌ద‌ర్శ‌కులు ఇప్ప‌టికే టాలీవుడ్‌లో నిల‌దొక్కుకోగా ఇప్పుడు వీరి భాట‌లోకి మ‌రో అగ్ర‌ద‌ర్శ‌కుడు చేరాడు. కె.ఎస్‌.ర‌వీంద్ర అలియాస్ బాబీ నిర్మాత‌గా మారాడు. మెగా కుటుంబ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న సినిమాతో నిర్మాత‌గా బాబీ మార‌బోతున్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాబీ నిర్మాత‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడ‌న్న‌మాట‌. సో ఏదేమైనా ద‌ర్శ‌కులు త‌మ సొంత బ్యాన‌ర్లు ఏర్పాటు చేసుకొని సినిమాలు నిర్మిస్తే నిర్మాత‌ల కోసం ఎదురు చూడ‌కుండా త‌మ ప‌నిని తామె చ‌క్క‌బెట్టుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

నిర్మాత‌గా మారిన టాలీవుడ్ క్రెజీ డైరెక్టర్ …!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share