తీవ్రంగా గాయ‌ప‌డిన టాలీవుడ్ యంగ్‌హీరో…!

June 15, 2019 at 2:12 pm

ఓ సినిమాలో డూప్ లేకుండా యాక్టింగ్ చేసిన ఓ యంగ్‌హీరో అదుపు త‌ప్పి బొక్క బొర్లా పడి, తీవ్ర‌గాయాలతో ఆస్ప‌త్రి పాలైన సంఘట‌న ఇది. యాక్ష‌న్‌, ఫైట్స్‌, జంపింగ్ వంటి స‌న్నివేశాల‌ల్లో సినిమా హీరోలంతా ఒళ్ళు అలువ‌కుండా డూప్‌ల‌తో ప‌నికానిస్తారు. డూప్‌లు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి హీరోల స‌న్నివేశాల‌ల్లో న‌టించి సినిమాను ముందుకు న‌డిపిస్తారు. ఇంత క‌ష్ట‌ప‌డిన డూప్‌ల‌కు మిగిలేది కాసిన్ని కాసులే. డూప్‌లు న‌టించిన సీన్లు తెర‌మీద చూసిన జ‌నం హీరోకు కేక‌లు, ఈలలు, చ‌ప్ప‌ట్ల‌తో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతారు.

అయితే ఓ సినిమాలో డూప్‌తో ప‌నిలేద‌ని తానే రియ‌ల్ హీరోగా ఫీల్ అయ్యాడు యంగ్‌హీరో… కానీ ఏం జ‌రిగిందంటే… ద‌ర్శ‌కుడు యాక్ష‌న్ అన‌గానే ఓ ఎతైన భ‌వ‌నం నుంచి దూకాడు.. బొక్క‌బోర్లా ప‌డి తీవ్ర‌గాయాల పాలై ఆస్పత్రి బెడ్‌మీద సేద తీరుతున్నాడు.. పాపం ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు… నాగ‌శౌర్య‌. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య సమంత స‌ర‌స‌న ఓ బేబీ సినిమాలో న‌టిస్తున్నాడు. దీనితో పాటుగా మ‌రో కొత్త చిత్రంలో కొత్త ద‌ర్శ‌క‌డుతో త‌న సొంత బ్యాన‌ర్‌లో న‌టిస్తున్నాడు.

నాగశౌర్య ర‌మ‌ణ తేజ అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలో న‌టిస్తున్నాడు. నాగ‌శౌర్య సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా ప్రొడ‌క్ష‌న్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో ఫైటింగ్ సీన్‌ను షూట్ చేస్తున్నారు. హీరో రౌడీల న‌డుమ జ‌రుగుతున్న ఈ స‌న్నివేశంలో భాగంగా ఓ ఎతైన భ‌వ‌నం నుంచి కిందికి దూకాలి. అయితే ఇలాంటి రిస్క్ సీన్ల‌ను డూప్‌ల‌తో చేస్తారు. కానీ నాగ‌శౌర్య డూప్‌ను కాద‌ని తానే స్వ‌యంగా భ‌వ‌నం నుంచి కిందికి దూకాడు. ప‌ట్టుత‌ప్పంది.. బొర్ల‌ప‌డ్డాడు. దీంతో నాగ‌శౌర్య కాలుకు తీవ్ర‌గాయ‌మైంది. వెంట‌నే చిత్ర‌యూనిట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైధ్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఓ నెల రోజుల విశ్రాంతి అవ‌సరం అన‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింది.

తీవ్రంగా గాయ‌ప‌డిన టాలీవుడ్ యంగ్‌హీరో…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share