టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక డేటింగ్ !

June 26, 2019 at 10:18 am

ఓ రౌడీ హీరోతో అందాల సుంద‌రి ర‌ష్మీక మంద‌న్న డేటింగ్‌లో ఉందా…? రౌడీ హీరోతో ఓ వైపు ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతున్న ఈ అమ్మ‌డు వ్య‌వ‌హారం ఏమై ఉంటుంది. రాత్రులు ప‌గ‌లు అనే తేడా లేకుండా పార్టీలు, సినిమా ఫంక్ష‌న్ల‌కు వీరిద్ద‌రే ప్ర‌త్య‌క్షం అవుతుండ‌టంతో ఈ విష‌యం ఇప్పుడు టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. రౌడీ హీరోతో ర‌ష్మీక డేటింగ్‌లో ఉందా…? లేక పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిందా… అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇంత‌కు ర‌ష్మీక మంద‌న్న ఏ రౌడీ హీరోతో తిరుగుతుంద‌నే క‌దా మీకు ఉన్న అనుమానం. అదేనండీ… రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ర‌ష్మీక మంద‌న్న, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇద్ద‌రు క‌లిసి గీతా గోవిందం సినిమాలో క‌లిసి న‌టించారు. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. దీంతో ఈజోడీ మ‌ళ్ళా డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో జ‌త‌క‌ట్టింది. ఈ సినిమాలోని పాట‌లు ఒక‌దాని వెంట ఒక‌టి విడుద‌ల చేస్తున్నారు. పాట‌లు ఇప్ప‌టికే నెట్టింట్లో హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో డియ‌ర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఇక ఈ ఇద్ద‌రు హిట్ ఫేయిర్‌గా పేరు తెచ్చుకున్న వేళా విశేషం ఏమో గాని, ఎక్క‌డ సినిమా ఫంక్ష‌న్ జ‌రిగితే అక్క‌డ ఇద్ద‌రు ప్ర‌త్య‌క్షం అవుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ వెళ్ళిన ప్ర‌తి ఫంక్ష‌న్‌కు ర‌ష్మీక మంద‌న వెళుతుంద‌ట‌. ఇటీవ‌ల ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా స‌క్సెస్ మీట్‌లో ఇద్ద‌రు క‌లిసే పాల్గొన్నార‌ట‌. ఇక ఇటీవ‌ల విడుద‌లైన ఏజెంటు సాయి శ్రీ‌నివాస్ ఆత్రేయ సినిమాను కూడా ప్రెండ్స్‌తో క‌లిసి చూస్తే అందులో ర‌ష్మీక కూడా ఉంద‌ట‌. త‌రువాత జూబ్లీహిల్స్‌లో ఓ హోట‌ల్‌లో పార్టీ చేసుకుంటే అందులో కూడా ర‌ష్మీక విజ‌య్ దేవ‌రకొండ వెంటే ఉంద‌ట‌. అంటే ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయార‌ని ఇప్ప‌డు టాలీవుడ్‌లో లోకం కోడై కూస్తుంది. ఇది నిజ‌మోనా లేక కాదా అనేది ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు చెపితే కాని తెలియ‌దు. సో ఇద్ద‌రి మ‌ద్య మాత్రం స‌మిథింగ్ ఏదో జ‌రుగుతుంద‌నేది మాత్రం నిజం.

టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక డేటింగ్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share