టాలీవుడ్ హీరోకి గాయాలు .. ఆసుపత్రిలో చికిత్స

March 11, 2019 at 4:05 pm

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విశాల్. ఇటీవల అభిమన్యుడు, పందెం కోడి 2 సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం టెంపర్ తమిళ రిమేక్ లో నటిస్తున్నాడు. తమ అభిమాన హీరోల సినిమాలంటే డ్యాన్స్, ఫైట్స్ ఖచ్చితంగా ఉండాలి. కమర్షియల్ మూవీల్లో హీరోల డాన్స్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. తమ అభిమా హీరో తెరపై డ్యాన్స్ చేస్తుంటే..ఫ్యాన్స్ ఖుషీ వేరే ఉంటుంది. అయితే అభిమానులను మెప్పించే విధంగా డ్యాన్స్ చేయడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది.

తాజాగా హీరో విశాల్ కొన్ని కష్టమైన స్టెప్స్ కోసం ప్రయత్నిస్తూ షూటింగ్ లో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెంపర్ రిమేక్ తమిళంలో ‘అయోగ్య’టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో గలంలో బోయపాటి, బన్ని కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే..సాంగ్ మంచి హిట్ అయ్యింది. తాజాగా అయోగ్యలో ఈ ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. అయితే బన్నీ రేంజ్ లో విశాల్ కూడా కష్టమైన స్టెప్స్ వేయడానికి రెడీ అయ్యాడట.

అయితే ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడట. మోచేయి వాయడంతో పాటు కాలికి కూడా గాయమయిందట. దీంతో ఈ పాట చిత్రీకరణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో విశాల్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను విశాల్, జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ హీరోకి గాయాలు .. ఆసుపత్రిలో చికిత్స
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share