దేవరకొండకు తృటిలో తప్పిన ప్రాణాపాయం

December 17, 2018 at 11:52 am

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌`టిలో ప్రాణాపాయం త‌ప్పింది. రైలు ప్ర‌మాదం స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఏంటీ రైలు ఎక్క‌డ‌మేంటి…ప్ర‌మాదమేంటి అనుకుంటున్నారా… ప్ర‌మాదం జ‌రిగిన మాట వాస్త‌మే.. జరిగింది కూడా రైలు ప్ర‌మాద‌మే.. అయితే ఇదంతా ఆయ‌న హీరోగా న‌టిస్తున్న డియ‌ర్ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఓ స‌న్నివేశం తెర‌కెక్కించే స‌మ‌యంలో జ‌రిగింది. “కదులుతున్న ట్రయిన్… ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి వేగంగా మెట్లు దిగాలి.. అంతే వేగంగా ఫ్లాట్ ఫామ్ పైన పరుగెత్తుతూ రైలు అందుకోవాలి.” ఈ సన్నివేశం తీస్తున్న సమయంలో పరుగెత్తుతూ ట్రైన్ ఎక్కబోయి స్లిప్ అయ్యి కింద‌ప‌డిపోయాడు. కొద్దిగా అయితే ఏకంగా ట్రైన్ కింద పడేవాడే.

అంతలోనే గట్టిగా పట్టుకున్నాడు. పక్కనే ఉన్న సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై విజయ్ దేవరకొండను పక్కకు లాగేసారు. దీంతో ఆయ‌న‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. కొన్ని రోజులుగా కాకినాడలో డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి ఏక ధాటిగా జ‌రుగుతోంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఇదే భారీ షెడ్యూల్‌. ప్రమాదం అనంతరం హోటల్కు చేరుకున్న విజ‌య్ త‌గిలిన దెబ్బ‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. లైఫ్ లో ఏదీ ఈజీగా రాదంటూ ఓ పోస్ట్ కూడా పెట్ట‌డం విశేషం. యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఈ ప్రమాద దృశ్యాల్ని చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. విజ‌య్ ఎడ‌మ చేతికి, కుడికాలికి చిన్న‌చిన్న దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో ఇటు దేవ‌ర‌కొండ అటు చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

లేదంటే షూటింగ్‌కు అంత‌రాయం ఏర్ప‌డేది.. గాయాల నుంచి తేరుకున్న విజ‌య్ య‌థావిధిగా షూటింగ్‌లో పాల్గొంటుండ‌డం విశేషం. మ‌రో హీరో అయితే నాకు కాస్త విశ్రాంతి కావాలి అనే డైలాగు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల ముందు వినిపించేవార‌ని అప్పుడే నెటిజ‌న్ల నుంచి విజ‌య్‌పై ప్ర‌శంసల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా విజ‌య్‌పై రోజురోజుకు టాలీవుడ్‌లో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇంకో తాజా విష‌య‌మేంటంటే మ‌నోడిని నెట్‌లో అత్య‌ధిక మంది వెతికారంట‌. ఫోర్బ్స ప్ర‌క‌టించిన సెల‌బ్రిటీల జాబితాలో అనుహ్యంగా రాంచ‌ర‌ణ్‌, విజ‌య్ పేర్లు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక వీరికి ద‌క్కిన గుర్తింపుగానే చెప్పుకోవాలి.

దేవరకొండకు తృటిలో తప్పిన ప్రాణాపాయం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share