ఆ హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎఫైర్‌… హీరోయిన్ షాకింగ్ ట్వీట్‌

May 15, 2019 at 1:09 pm

టాలీవుడ్ లో వరుస సక్సెస్‌ల‌తో సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లిచూపులు – అర్జున్‌రెడ్డి – గీత‌గోవిందం – టాక్సీవాలా ఇలా వ‌రుస హిట్ల‌తో త‌క్కువ టైంలోనే సెన్షేష‌న‌ల్ హీరో అయ్యాడు. ప్ర‌స్తుతం విజ‌య్ డియ‌ర్ కామ్రేడ్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ త‌న‌కు క‌లిసొచ్చిన ర‌ష్మిక మంద‌న్నాతో మ‌రోసారి రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి కుమార్ డైరక్షన్‌లో తెర‌కెక్కే మ‌రో సినిమాకు సైన్ చేశాడు.

ఈ సినిమాలో కూడా మ‌ద్దుల‌కు ఏ మాత్రం కొద‌వ ఉండ‌ద‌ని… హీరో, హీరోయిన్ల మ‌ధ్య తెర‌మీద కావాల్సిన‌న్ని లిప్‌లాక్‌లు ఉంటాయ‌ని అంటున్నారు. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక స‌హ‌జంగానే పెళ్లి కాకుండా టాప్ హిట్ల‌తో దూసుకుపోతోన్న ఈ యంగ్ హీరో ఏ హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉన్నా వాళ్లిద్ద‌రికి లింకులు పెట్టేస్తుంటారు.

ఇప్పుడు కూడా షూటింగ్‌లో ఐశ్వ‌ర్య రాజేష్‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడ‌ని.. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. దీనిని విజ‌య్ చాలా లైట్ తీస్కొన్నాడు. ఇక హీరోయిన్ ఐశ్వ‌ర్య మాత్రం ట్విట్ట‌ర్‌లో రిప్లే ఇచ్చింది. ఒక హీరోతో త‌న పెళ్లంటూ వార్త‌లు రాస్తున్నార‌ని.. అత‌డు ఎవ‌రో ?  కూడా త‌న‌కు చెపితే బాగుంటుంద‌ని… ప్ర‌స్తుతం సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తోన్నా… తాను ఎవ‌రిని అయినా పెళ్లాడితే ముందుగా మీకే చెపుతాన‌ని చాలా తెలివైన ఆన్స‌ర్ చేసింది.

ఆ హీరోయిన్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎఫైర్‌… హీరోయిన్ షాకింగ్ ట్వీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share