దుమ్మురేపుతున్న దేవరకొండ “డియర్ కామ్రేడ్ ” ట్రైలర్

July 11, 2019 at 11:14 am

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ జంట తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా ‘డీయర్ కామ్రెడ్’రూపొందుతుంది.

ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ నిర్మిస్తోంది. ఈ సినిమా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాగా తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన లిరికల్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే..’ అంటూ సాగుతున్న ఈ లిరికల్‌ వీడియో ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ ఇటీవల తన ట్విటర్‌లో.. ఈ పాటను ఇప్పటివరకు వందసార్లకు పైగా విన్నానని, ఇంకా వినాలపిస్తోందని అంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొత్తానికి ఈ మూవీ క్రికెట్ నేపథ్యంతో పాటు మంచి ప్రేమ కథా లా కనిపిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నది.

దుమ్మురేపుతున్న దేవరకొండ “డియర్ కామ్రేడ్ ” ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share