విజయ్ దేవరకొండ ‘రేసు” చాల కాస్టలీ గురూ!

May 28, 2019 at 2:29 pm

ఒక స‌న్నివేశం… ఈ సన్నివేశం ఎంతో కీల‌కమైంది. అందుకే ఈ స‌న్నివేశంకు ఎంత ఖ‌ర్చైనా భ‌రించాల్సిందే మ‌రి.. అనుకున్న‌దే త‌డువుగా ఎంత ఖ‌ర్చైనా తీసేద్దామ‌ని నిర్మాత‌, ద‌ర్శ‌కుడు నిర్ణ‌యించుకున్నారు. ఇక ఆగేదేమున్న‌ది… ఒక స‌న్నివేశం… ఖ‌ర్చు రూ.8కోట్లు… ఇది ఎవ‌రితోనే తెలుసా… టాలీవుడ్‌లో కుర్ర‌కారులో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున్‌రెడ్డి అలియాస్ విజ‌య్ దేవ‌ర‌కొండ కోస‌మ‌ట‌…

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా హీరో సినిమా తెర‌కెక్కుతుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈసినిమా ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ సినిమా నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేనీ, మోహ‌న్ చెరుకూరి, ర‌విశంక‌ర్ కాగా వీరు ఖ‌ర్చుకు వెనుకాడటం లేద‌ట‌. ఎందుకంటే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కు మంచి మార్కెట్ ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ట‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో ఫార్ములా 1 రేస‌ర్‌గా న‌టిస్తున్నాడ‌ట‌. బైక్ రేస‌ర్ అయిన విజ‌య్ న‌టిస్తున్న రేసు స‌న్నివేశం ఈ సినిమాకు గుండె కాయ‌లాంటిద‌ట‌. అందుకే ఎంత ఖ‌ర్చైనా షూట్ చేయాల్సిందేన‌ని భావించార‌ట‌. అందుకే ఈ సినిమాలో ఈ రేసు దృశ్యాన్నిచిత్రించేందుకు రూ.8కోట్ల ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. చిత్రానికి అన్నా మ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ దృశ్యాల‌ను ఢిల్లీలో హాలీవుడ్ స్టంట్‌మాస్ట‌ర్ నేతృత్వంలో చిత్రిస్తున్నార‌ట‌. సుమారు 20రోజులుగా ఈ షెడ్యూల్ సాగ‌నున్న‌ద‌ని ఫిలిం వ‌ర్గాల క‌థ‌నం. బైక్ రేసు కోసం విజ‌య్ ప్ర‌స్తుతం చెన్సైలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ట‌.

విజయ్ దేవరకొండ ‘రేసు” చాల కాస్టలీ గురూ!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share