తమిళ భామతో విజయ దేవరకొండ ఫిక్స్ !

May 20, 2019 at 12:21 pm

యూత్‌లో మంచి క్రేజి సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్‌రెడ్డి త‌ర్వాత ఈ యంగ్ హీరోకు ద‌క్షిణాది చిత్ర సీమలో ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్‌లో అయితే మ‌నోడికి తిరుగులేదు. స్టార్ డైరెక్ట‌ర్లు కూడా క్యూ క‌ట్టి నిల్చున్నారు. మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. అయితే దేవ‌ర‌కొండ మాత్రం ఆచితూచి స్టోరీల‌కు ఓకే చెబుతున్నాడు. యూత్‌కు క‌నెక్ట‌య్యే చిత్రాల వైపే ఆస‌క్తి చూపుతుండ‌టం విశేషం. ఇమేజ్‌ను కాపాడుకుంటేనే ఇత‌ర భాషాల్లోకి విస్త‌రించ‌డానికి ప్లాన్లు వేసుకుంటున్నాడు. ద‌క్షిణాదిలో పాగా వేసేందుకు క‌థ‌ల ఎంపిక‌తోపాటు అక్కడి తార‌గ‌ణం ఉండేట్లు చూసుకుంటున్నాడ‌ట‌.

ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఇక తాజా విష‌యానికి వ‌స్తే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటించనుంది. తమిళంలో పలు సినిమాల్లో నటించిన మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే ‘పేట’ డబ్బింగ్ చిత్రంతో పరిచయం అయ్యింది.

అయితే ఆమె డైరెక్ట్ తెలుగు సినిమా మాత్రం ‘హీరో’ అని చెప్పుకోవచ్చు. రజినీకాంత్ చిత్రం పేటలో సూపర్ స్టార్ కు చెల్లి పాత్రలో నటించి మెప్పించిన మాళవిక ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘హీరో’ చిత్రంలో నటించబోతుంది. వీరిద్దరి కాంబో ఎలా ఉంటుందో చూడాలి. హీరోలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించబోతున్నట్లు స‌మాచారం. మొదటి షెడ్యూల్ను ఢిల్లీలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ప్రేమ క‌థా చిత్రం కావ‌డంతో కాస్త రోమాన్స్ స‌న్నివేశాలు కూడా ఎక్కువ పాళ్ల‌లోనే ఉంటాయ‌ని స‌మాచారం. అర్జున్‌రెడ్డి సినిమా నుంచి అంత‌మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయ‌డంలో యూత్‌ను త‌ప్పు ప‌ట్ట‌లేమ‌ని సినీ పండితులు పేర్కొంటున్నారు.

తమిళ భామతో విజయ దేవరకొండ ఫిక్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share