మహేష్ తో విజయశాంతి రీ ఎంట్రీ !

March 12, 2019 at 4:03 pm

ఒకప్పుడు టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి. కెరీర్ బిగినింగ్ లో గ్లామర్ పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సీనియర్ నటులు నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబులతో నటించిన విజయశాంతి తర్వాత చిరంజీవితో పలు సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యంది.

కొంత కాలం తర్వాత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. కానీ అలాంటి సినిమాలు తర్వాత జనాలకు రుచించలేదు..దాంతో ఆమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయశాంతి మొదట బీజేపీలో ఉన్నా ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కొన సాగుతుండటంతో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ పార్టీ తర్వాత టీఆర్ ఎస్ లో విలీనం చేసి కేసీఆర్ తో చేతులు కలిపారు.

ఇక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో మెదక్ ఎంపిగా గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ తో తేడా రావడంతో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. తాజాగా మహేష్ బాబు, అనీల్ రావిపుడి సినిమాలో సెట్స్ పైకి ఎక్కబోతుంది. ఈ నేపథ్యంలో అనీల్ రావిపూడి..విజయశాంతితో నటింపజేయాలని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి స్పందిన రాలేదట..ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో మరి ఆమె అనీల్ రావిపూడి ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది తెలియరాలేదు. ఒకవేళ మహేష్ బాబు తో రీ ఎంట్రీ ఇస్తే విజయశాంతికి బాగా కలిసి వస్తుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరి వెండి తెరపై విజయశాంతి కనిపిస్తుందా లేదా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.

మహేష్ తో విజయశాంతి రీ ఎంట్రీ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share