ఆస‌క్తిరేపుతున్న విశ్వ‌నాథుడి విశ్వ‌ద‌ర్శ‌నం

February 19, 2019 at 1:08 pm

కే విశ్వ‌నాథ్‌… తెలుగు నేల ఆణిముత్యం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో క‌ల‌కాలం నిల‌చిపోయే ఎన్నో అపురూప చిత్రాలు వ‌చ్చాయి. శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం.. ఇలా ఎన్నోసినిమాల‌ను తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అందించారు. ఆ లెజెండ‌ర్ ద‌ర్శ‌కుడి జీవితం ఆధారంగా విశ్వ‌ద‌ర్శ‌నం పేరుతో బ‌యోపిక్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్ద‌న్‌ మహర్షి దర్శకత్వంలో ఈ బ‌యోపిక్ తెర‌కెక్కుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.0002

అయితే.. మంగళవారం నాడు కే విశ్వనాథ్‌ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌లో విశ్వ‌నాథ్‌పై ప‌లువురు ప్ర‌ముఖులు చెప్పే విష‌యాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయ‌న ప్ర‌తిభ గురించి, మ‌న‌స్త‌త్వం గురించి, ప‌నిచేసిన విధానం గురించి ఆయ‌న వారు చెప్పిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంది. నిజానికి.. ఎంత‌సేపూ హీరోహీరోయిన్లు, రాజ‌కీయ నేత‌ల బ‌యోపిక్‌లుగా వ‌చ్చాయి. అయితే..ఇలా ఓ ద‌ర్శ‌కుడిపై బ‌యోపిక్ వ‌స్తుండ‌డం అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది0017

ఈ సందర్భంగా కే విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తానుగొప్ప‌వాణి అనీ… అంద‌రికీ తెలియాల‌నే ఆశ త‌న‌కు లేద‌ని, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాల‌ని… అటువంటి ప్రయత్నమే ఈ విశ్వదర్శనం మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదని ఆయ‌న అన్నారు. దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదని… ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింద‌న్న విష‌యాన్నే ఈ సినిమాలో చూపించ‌బోతున్నామ‌ని అన్నారు.

ఆస‌క్తిరేపుతున్న విశ్వ‌నాథుడి విశ్వ‌ద‌ర్శ‌నం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share