మంచు “ఓటర్ ” ట్రైలర్ రిలీజ్

June 17, 2019 at 1:19 pm

మంచు విష్ణు ఓ సామాన్య ఓట‌రుగా ఓ స‌మ‌కాలిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై చేసిన పోరాట రూప‌మే ఓట‌ర్ సినిమా. ఓట‌రు సినిమా ట్రైల‌ర్‌ను ఎట్ట‌కేల‌కు విడుద‌ల అయింది. ట్రైల‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేయ‌గా దానిపై మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మంచు విష్ణు న‌టించిన ఓట‌ర్ సినిమా రావాల్సిన స‌మ‌యంలో రాలేక‌పోయింది. దీంతో ఈసినిమాను ప్రేక్ష‌కులు ఏమేర‌కు ఆదుకుంటారో చూడాలి.

మంచు విష్ణు కేరీర్‌లో ఓట‌ర్ సినిమా ఓమైలురాయిగా నిలిచిపోనున్న‌ద‌నే టాక్ వినిపిస్తుంది. ఎన్నో అవాంత‌రాల‌ను దాటుకుని సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంద‌నే చెప్పాలి. ఈ సినిమా జూన్‌21న విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా ట్రైల‌ర్‌లో వ‌ర్త‌మాన రాజకీయాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందించారు ద‌ర్శ‌కుడు జిఎస్ కార్తిక్‌. ఈ సినిమాలో సుప్రిత్‌, జ‌య‌ప్ర‌కాశ్‌ల‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ న‌టులు న‌టించారు.

ఇద్ద‌రు రాజ‌కీయ నాయకులు పోసాని – సంప‌త్‌రాజ్‌లు ప్ర‌జ‌ల‌ను దోచుకుని తిన‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తుంటారు. అయితే ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కు ఎలాంటి న్యాయం జ‌రగ‌డం లేద‌ని గ్ర‌హించిన ఓ సామాన్య యువ‌కుడు (మంచు విష్ణు) రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం భిగిస్తాడు. అత‌నికి అండ‌గా విష్ణు గురువు నాజ‌ర్‌, ప్రేయ‌సి సుర‌భీలు స‌హాయ స‌హాకారాలు అందిస్తారు. వీరికి స్నేహితులు తోడై సోష‌ల్ మీడియాను ఆస‌రా చేసుకుని రాజ‌కీయ నాయ‌కుల అవినీతిపై పోరు చేస్తుంటారు. దీంతో స‌మ‌కాల‌న రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పులు వ‌స్తాయో అనేది సినిమాలో చూడాల్సిందే. ఏదేమైనా ఓట్ల ముందు రావ‌ల్సిన ఈ సినిమా ఓట్లు అయిపోయిన త‌రువాత వ‌స్తుంది. ఈ సినిమా ఏమేర‌కు రాణిస్తుందో వేచిచూడాల్సిందే.

మంచు “ఓటర్ ” ట్రైలర్ రిలీజ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share