బాలయ్య అభిమానిగా వైఎస్ జగన్ ఫోటో ..సోషల్ మీడియాలో వైరల్

June 19, 2019 at 12:46 pm

ఎంత నేర్చినా.. ఎంత వార‌లైనా.. న‌ట‌న‌కు అభిన‌యానికి దాసులు కానివారంటూ ఎవ‌రూ ఉండ‌రు. “తెర‌మీద మిమ్మ‌ల్ని మించిన వారు లేరంటే.. నేను కూడా ఒప్పుకొంటాను కానీ. రాజ‌కీయాల్లో మాత్రం మీ ద‌బాయింపులు క‌ట్టిపెట్టాలి!!“-అని సాక్షాత్తూ ఎన్టీఆర్ అంత‌టి వాడిని అసెంబ్లీలో దుమ్మురేపుతూనే న‌ట‌సార్వ‌భౌముడిపై త‌న అభిమానాన్ని చాటుకున్నారు నాటి నాయ‌కుడు టంగుటూరి అంజ‌య్య. అంతెందుకు.. అన్న‌య్య చిరంజీవి త‌న సొంత పార్టీ జెండాపై అసెంబ్లీలో అడుగు పెట్టిన‌ప్పుడు సాక్షాత్తూ.. వైఎస్ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. “చిరంజీవి న‌ట‌నంటే నాకు చాలా ఇష్టం. కానీ, రాజ‌కీయంగా ఆయ‌న ఎద‌గాల్సిన అవ‌స‌రం ఉంది. విష‌యం తెలుసుకుని విమ‌ర్శించాలి“- అని వ్యాఖ్యానించారు.

అంటే, సాధార‌ణ ప్ర‌జ‌లైనా.. రాజ‌కీయ ఉద్ధండులైనా.. వెండితెర వేల్పుల‌కు దాసులు కావాల్సిందే.అంతెందుకు.. ఇటీ వ‌ల దేశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన న‌టుడు అక్ష‌య్‌కుమార్‌తో దాదాపు 3 గంట‌ల పా టు సుదీర్ఘ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. సో.. రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. వెండితెర వేల్పుల‌కు మాత్రం స‌రైన గౌర‌వం ఎప్పుడూ ల‌భిస్తూనే ఉంది. తాజా విష‌యంలోకి వెళ్తే.. ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా వెండితెర వేల్పున‌కు వీరాభిమాని అనే విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

వ్య‌క్తిగ‌తంగా తాను ఇంకా రాజ‌కీయ అరంగేట్రం చేయ‌క ముందు నుంచి కూడా జ‌గ‌న్‌.. ఎన్టీఆర్ త‌న‌యుడు, న‌ట‌సింహం బాల‌య్యకు వీరాభిమాని అనే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌ని విష‌యం.
తాజాగా ఈ విష‌యం వెలుగు చూసింది. తాజ‌గా ముగిసిన తొలి ద‌శ అసెంబ్లీ స‌మావేశాల లాబీల్లోనే ఈ విష‌యం వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఎన్నిక‌ల వేళ‌.. బాల‌య్య హిందూపురం నుంచి పోటీ చేసినా కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌ను ఏమీ అన‌క‌పోవ‌డం, జ‌గ‌న్ కూడా బాల‌య్య‌ను టార్గెట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీనికి ప్ర‌ధాన కార‌ణం గ‌తంలో తాను బాల‌య్యకు వీరాభిమాని కావ‌డ‌మేన‌ని జ‌గ‌న్ త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పార‌ట‌. అంతేకాదు, క‌డ‌ప జిల్లా బాల‌య్య అభిమాన సంఘానికి సైతం జ‌గ‌న్ ప్రెసిడెంట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యాలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. 2000 సంవ‌త్స‌రంలో వెలువ‌డిన స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాకు శుభాకాంక్ష‌లు చెబుతూ.. ప‌లు ప‌త్రిక‌ల్లో ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లు వెలుగు చూశాయి. దీంతో బాల‌య్య అంటే.. జ‌గ‌న్‌కు ఇంత అభిమాన‌మా?! అని వైసీపీ నాయకులు బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.

బాలయ్య అభిమానిగా వైఎస్ జగన్ ఫోటో ..సోషల్ మీడియాలో వైరల్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share