156 మంది చిన్నారుల‌కు ప్రాణ‌దానం చేసిన లారెన్స్..

July 22, 2019 at 6:46 pm

కింది స్థాయి నుంచి పైకొచ్చిన కొంద‌రు త‌న స్థాయిని మ‌రిచిపోకుండా సామాజిక సేవ చేయ‌డానికి వెనుకాడ‌రు. అలాగే ఓ హీరో కూడా కేవ‌లం చిన్న చిన్న సినిమాల్లో గ్రూప్ డ్యాన్స‌ర్‌గా ప‌నిచేసి త‌రువాత చిన్న సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా మారి, త‌రువాత పెద్ద హీరోల‌కు, పెద్ద సినిమాకు కొరియోగ్రాఫ‌ర్‌గా ఎదిగి, త‌రువాత పెద్ద హీరోల‌తోనూ సినిమాల‌ను నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, చివ‌రికి తానే హీరో అయిన వ్య‌క్తి కాదు.. మ‌హాత్త‌ర‌శ‌క్తి 156మంది చిన్నారుల‌కు ప్రాణ‌దానం చేసాడంటే న‌మ్మ‌బుద్ది కావడం లేదు క‌దూ…

నిజ‌మేనండి… ఓ కొరియోగ్రాఫ‌ర్ నుంచి హీరోగా మారి ఇప్పుడు ఎందరి కుటుంబాల‌కు జీవ‌నాధారంగా మారాడు… ఇంత‌కు అత‌డేవ‌ర‌నే క‌దా మీ ప్ర‌శ్న‌. అక్క‌డికే వ‌స్తున్నా… ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు లారెన్స్‌. ఎంద‌రో హీరోల చేత స్టెఫ్పులు వేయించిన ఈ హీరో క‌మ్ కొరియోగ్రాఫ‌ర్ ఇప్పుడు సినిమాల‌తో గుండెకు చిల్లులు ప‌డి కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారుల‌కు ప్రాణ‌దానం చేస్తున్నాడు. ఇప్ప‌టికే 156మంది చిన్నారుల‌కు గుండెకు ప‌డిన చిల్లులు పూడిపించ‌డం, కొంద‌రికి ఆఫ‌రేష‌న్లు చేయించి ప్రాణ‌దాత‌గా నిలిచాడు.

సినిమాల్లో మ‌నం హీరోలను చూస్తాను… కానీ లారెన్స్ మాత్రం రీల్ కాదు.. రియ‌ల్ హీరోగా నిలుస్తున్నాడు. సొంత ఖ‌ర్చు భ‌రిస్తూ 156మంది చిన్నారుల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన లారెన్స్ నిజంగా దేవుడితో స‌మాన‌మే క‌దా మ‌రి. లారెన్స్ తెర‌పైనే కాదు నిజ‌జీవితంలో ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయుడిగా నిలిచాడు. సినిమాల్లో నాగార్జున‌, ప్ర‌భాస్ లాంటి హీరోల సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు లారెన్స్‌. తాను కాంచ‌న సినిమాను మూడు భాగాలుగా తీసి సూప‌ర్ డూప‌ర్ హిట్ చేశాడు. ఇప్పుడు లారెన్స్ బాలీవుడ్‌లో అక్ష‌య్‌కుమార్‌తో ల‌క్ష్మీ బాంబ్ సినిమా రూపొందిస్తున్నాడు.

156 మంది చిన్నారుల‌కు ప్రాణ‌దానం చేసిన లారెన్స్..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share